రష్యాలో కాల్పులు కలకలం సృష్టించాయి.. మాస్కోలోని స్టేట్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి కాల్పులకు తెగబడ్డాడు.. తోటి విద్యార్థులతో పాటు లెక్చరర్లపై కాల్పులకు తెగబడ్డాడు.. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. ఇక, కాల్పులు జరుగుతోన్న సమయంలో.. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు.. పై అంతస్తు నుంచి కిందకు దూకారు.. మరికొందరు విద్యార్థులు.. అలా కూడా కొంతమంది గాయాలపాలయ్యారు.