ఉక్రెయిన్ లో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఓ విమానయాన సంస్థ తన సర్వీసుల్ని నిలిపేసింది. జర్మనీకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సా సంక్షోభంలో చిక్కుకున్న ఉక్రెయిన్‌కు తమ సర్వీసులు ఆపేశామని ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా ఏ క్షణంలోనైనా దాడికి దిగే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ దేశ రాజధాని కీవ్‌తో పోర్టు సిటీ ఒడిసా కూడా నేటి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తమ సిబ్బంది, ప్రయాణికుల రక్షణకు తాము…
రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఉక్రెయిన్‌కు మూడు వైపుల నుంచి రష్యా బలగాలు చుట్టుముట్టగా, ఉక్రెయిన్‌లో రెబల్స్ తిరుగుబాటు దారులు దాడులు చేసేందుకు సిద్దమయ్యారు. ఉక్రెయిన్ అనుకూల వాదులు ముందుగా దాడులకు దిగుతున్నారని, రెబల్స్ పేర్కొంటున్నారు. అయితే, ఉక్రెయిన్ వ్యతిరేకులే దాడులకు దిగుతున్నట్టు చెబుతున్నారు. దాడులకు దిగబోమని రష్యా చెబుతున్నది. కానీ, ఈ మాటలను నమ్మే స్థితిలో ప్రపంచదేశాలు లేవని, ఏ క్షణంలో అయినా రష్యా ట్రిగ్గర్ నొక్కే అవకాశం ఉంటుందని అమెరికా…
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో యావత్ ప్రపంచం అక్కడి పరిస్థితిలపై ఉత్కంఠతో గమనిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగడం తథ్యమన్న వేళ కాల్పులతో తూర్పు ఉక్రెయిన్‌లోని కాడివ్కా ప్రాంతం దద్దరిల్లింది. రష్యా మద్దతిస్తున్న వేర్పాటువాదులు, ఉక్రెయిన్ సైనికుల మధ్య ఈ కాల్పులు జరిగాయి. దీంతో ఈ ఘటనపై అటు ఉక్రెయిన్ సైన్యం, ఇటు వేర్పాటు వాదులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. గ్రనేడ్లు, భారీ ఆయుధాలతో వేర్పాటువాదులే తొలుత కాల్పులకు…
రష్యా- ఉక్రెయిన్ మధ్య ప్రస్తుతం పరిస్థితులు కొంతమేర చక్కబడ్డాయి. ఉక్రెయిన్‌తో యుద్దాన్ని కోరుకోవడం లేదని రష్యా స్పష్టం చేసింది. అంతేకాదు, కొందమంది బలగాలను వెనక్కి రప్పిస్తున్నట్టు రష్యా తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎంతమంది బలగాలను, ఎక్కడి నుంచి వెనక్కి రప్పిస్తున్నారు అన్నది క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇదిలా ఉంటే, రష్యా ఉక్రెయిన్ పై దాడికి దిగితే దేశాన్ని రక్షించుకోవడానికి తాము సైతం సిద్దంగా ఉన్నామని ఆ దేశంలోని చిన్నారుల నుంచి ముసలివాళ్ల వరకు చెబుతున్నారు. చెప్పడమే…
రష్యా- ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నాయి.. వీటి ప్రభావం స్టాక్మార్కెట్లపై కూడా పడిన విషయం తెలిసిందే కాగా… రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అప్రమత్తమైంది భారత ప్రభుత్వం.. దీనిపై భారత విదేశాంగశాక ఓ ప్రకటన విడుదల చేసింది.. ఉక్రెయిన్‌లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు వెల్లడించింది.. పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని.. ఉక్రెయిన్‌లో భారత విద్యార్థులున్నందున అప్రమత్తంగా ఉన్నామని ప్రకటించింది ప్రభుత్వం.. ఇక, భారత్-ఉక్రెయిన్ మధ్య…
ఉక్రెయిన్ రష్యా యుద్ధం చేసే అవకాశం ఉందని, ఫిబ్రవరి 16 నుంచి యుద్ధం జరిగే అవకాశం ఉందని పలు అంతర్జాతీయ సంస్థలు పేర్కొన్నాయి. అటు అమెరికా, ఉక్రెయిన్ దేశాలు సైతం రష్యా యుద్దానికి సన్నద్దమవుతున్నట్టు పేర్కొన్నాయి. అయితే, అనూహ్యంగా రష్యా తమ బలగాలు కొన్నింటిని వెనక్కి రప్పించింది. సరిహద్దుల్లో యుద్దవిన్యాసాలను పూర్తి అయిందని, కొన్ని బలగాలనే వెనక్కి పిలిపిస్తున్నట్టు రష్యా రక్షణశాఖ మంత్రి పేర్కొన్నారు. రష్యా రక్షణశాఖ ఆదేశాలు వచ్చిన తరువాత కొన్ని బలగాలు, యుద్ద ట్యాంకర్లను…
రష్యా ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకూ మారిపోతున్నాయి. అమెరికా ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఈనెల 16 న ఉక్రెయిన్‌పై దాడికి దిగే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో పరిస్థితులు మరింత దిగజారాయి. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా ఇదే విషయాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. తమకు ఉక్రెయిన్‌పై దాడికి దిగే ఉద్దేశం లేదని రష్యా చెబుతున్నా ఎవరూ పట్టించుకోడం లేదు. ఇక…
ఉక్రెయిన్-రష్యా సంక్షోభం మరింత ముదిరింది. ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదనిపిస్తోంది. ఇప్పటికే విదేశీ పౌరులు, సిబ్బంది చాలా వరకు ఆ దేశాన్ని వీడారు. అమెరికా రాయబార కార్యాలయం ఖాళీ అయింది. ఇది పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఖాయమనే అంటున్నారు. అదే జరిగితే పర్యవసనాలు ఎలా ఉంటాయన్నది ప్రశ్న. రష్యా చర్యతో యూరప్ యుద్ధ రంగంగా మారే ప్రమాదం ఉంది. ఒకవేళ రష్యా దాడి చేయకపోయినా సమీప భవిష్యత్‌లో ఈ ఉద్రిక్తతలు ఆగవు.…
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉక్రెయిన్ మూడు వైపుల నుంచి రష్యా బలగాలు చుట్టుముట్టడంతో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. అమెరికాతో పాటు యూరప్ దేశాలు శాంతి కోసం ప్రయత్నిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధభయంతో అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలాయి. వాటి ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడింది. సోమవారం రోజున సెన్సెక్స్ 1700 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 17 వేల పాయింట్ల నుంచి 16900కి చేరింది. మార్కెట్లు అనుకూలంగా లేకపోవడంతో అన్నిరంగాల్లో షేర్ల అమ్మకాలు…