ప్రపంచంలోని అతిపెద్ద నగరాల విషయానికి వస్తే ముందుగా ఆ నగరాల పరిమాణం ముఖ్యం. విస్తారమైన మహానగరాల నుండి జనసాంద్రత కలిగిన పట్టణ కేంద్రాల వరకు, ఈ నగరాలు లక్షలాది మందికి నివాసంగా ఉన్నాయి. అలాగే విస్తారమైన భూభాగాలను కలిగి ఉన్నాయి. ఇకపోతే విస్తీర్ణం వారీగా ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద నగరాల వివరాలు చూస్తే.. 1. టోక్యో (జపాన్): జపాన్ లోని టోక్యో నగరం ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటి. మొత్తం 2,000…
రష్యాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నదిలో మునిగి నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మరణించారు. ఒకరు రక్షించబడ్డారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.
రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో నదిలో అయిదుగురు భారతీయ విద్యార్థులు మునిగిపోయారు. స్థానికులు అందులో ఒకరిని రక్షించారు. నలుగురు పూర్తిగా నీటిలో ముగిని మృతి చెందారు. ఈ మృతదేహాలను వీలైనంత త్వరగా వారి బంధువులకు పంపించడానికి రష్యా అధికారులతో సమన్వయం చేస్తున్నామని దేశంలోని భారతీయ మిషన్లు శుక్రవారం వెల్లడించాయి.
తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోడీ విజయంపై శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీయే) విజయానికి శుభాకాంక్షలు.
రష్యాకు చెందిన వ్యోమగామి ఒలేగ్ కొనోనెంకో అనే వ్యక్తి అంతరిక్షంలో 1000 రోజులు పూర్తి చేసిన ప్రపంచంలోనే మొదటి వ్యక్తిగా నిలిచారు. రష్యాలో వ్యోమగామిని కాస్మోనాట్ అంటారు. ఇంతకుముందు ఈ రికార్డు రష్యాకు చెందిన కాస్మోనాట్ గెన్నాడీ పడల్కా పేరిట ఉంది. అతను 878 రోజులు అంతరిక్షంలో ఉన్నారు.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకప్పటి తన పర్సనల్ బాడీగార్డు అయిన అలెక్సీ డ్యూమిన్కి అత్యున్నత పదవి కట్టబెట్టారు. 51 ఏళ్ల డ్యూమిన్ని స్టేట్ కౌన్సిల్ సెక్రటరీగా పుతిన్ నియమించారు.
Puthin : రష్యా సైనికులు ఉక్రెయిన్లో నగరాల మీదుగా ముందుకు సాగుతున్నారు. దీంతో పాశ్చాత్య దేశాలు ప్రత్యక్ష యుద్ధానికి దిగకుండా రష్యాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
రష్యా తాజాగా ఉక్రెయిన్పై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బఫర్జోన్ ఏర్పాటే లక్ష్యంగా ఉక్రెయిన్పై రష్యా దాడులు ఉధృతం చేసింది