Russian Strike On Ukraine Rail Station: ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ రెండు దేశాల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభం అయింది.. ఆరు నెలలు పూర్తి అయినా రెండు దేశాలు పట్టువీడటం లేదు. ముఖ్యంగా రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సర్వనాశనం అవుతోంది. ఇదిలా ఉంటే రష్యా జరిపిన మిస్సైల్ దాడిలో 22 మంది మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ బుధవారం వెల్లడించారు.