Shehbaz Sharif: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్-రష్యా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-రష్యా సంబంధాలను తాము గౌరవిస్తున్నామని చెప్పారు. చైనాలో జరిగిన ఎస్‌సీఓ సమావేశానికి హాజరైన షరీఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. మాస్కోకు న్యూఢిల్లీతో ఉన్న సంబంధాలను ఇస్లామాబాద్ గౌరవిస్తుంది, అవి చాలా బాగున్నాయని మంగళవారం షరీఫ్ అన్నారు.
PM Modi-Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని భారత్‌లో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించినట్లుగా ఆ దేశం ప్రకటించింది. 2025లో ఈ పర్యటనకు సంబంధించిన తేదీలను నిర్ణయించనున్నట్లుగా క్రెమ్లిన్ సహాయకుడు యూరీ ఉసాకోవ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పుతిన్, పీఎం మోడీ ఏడాదికి ఒకసారి సమావేశాలు నిర్వహించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారని, ఈ సారి రష్యా వంతు అని భారతదేశంలోని రష్యా రాయబార కార్యాలయం తెలిపింది.
PM Modi: రష్యా ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ భారీ విజయం సాధించారు. మరో 6 ఏళ్ల పాటు రష్యా అధ్యక్షుడిగా ఉండేందుకు పుతిన్‌కి అవకాశం లభించింది. అయితే, బుధవారం భారత ప్రధాని నరేంద్రమోడీ, పుతిన్‌కి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. ఇరువురు నేతలు, భారత్-రష్యా మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు తమ ప్రయత్నాలను తీవ్రతరం చేయాలని అంగీకరించారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.