Russia-Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా తీవ్రంగా దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలపై నియంత్రణ కోసం ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా తాగు నీరు, కరెంట్, ఇతర మౌళిక సదుపాయాలే లక్ష్యంగా రాకెట్లు, డ్రోన్లతో రష్యా ఉక్రెయిన్ పట్టణాలపై విరుచుకుపడుతోంది. మిలియన్ల మంది తాగునీరు, కరెంట్ లేకుండా అల్లాడుతున్నారు. రాజధాని కీవ్ తో పాటు ఖార్కీవ్, ఒడెసా నగరాలపై రష్యా దాడులు చేసింది. దీంతో ఆయా నగరాల్లో విద్యుత్ స్తంభించిపోయింది. కీవ్ మేయర్ విటాలి క్లిట్ష్కీ…
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో సోమవారం ఉదయం పలు పేలుళ్లు సంభవించాయి. ఉక్రెయిన్‌పై రష్యా మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది. కొన్ని నెలల విరామం తర్వాత కీవ్‌లోని అనేక ప్రాంతాల్లో పేలుళ్లు జరగగా.. పొగలు కమ్ముకున్నాయి.
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆరంభం అయి ఏడు నెలలకు చేరినా.. ఇరు వైపుల దాడులు ఆగడం లేదు. తాజాగా మరోసారి రష్యా, ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. సెంట్రల్ ఉక్రెయిన్ లోని డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలో రష్యా దాడులు చేసింది. ఈ దాడుల్లో 13 మంది సాధారణ పౌరులు మరణించినట్లు స్థానిక గవర్నర్ వాలెంటివ్ రెజ్నిచెంకో తెలిపారు. రష్యా దాడుల్లో 11 మంది అక్కడిక్కడే మరణించగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. జపోరిజ్జియా అణు విద్యుత్…
దాదాపు 5నెలలుగా రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్‌లో ఖార్కివ్ ప్రాంతంలోని చుహుయివ్ పట్టణంలో రష్యా సైనికులు బాంబు దాడి చేశారు. దీని ఫలితంగా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని ఉక్రెయిన్ అధికారులు అనుమానిస్తున్నారు.