ఉక్రెయిన్ పై విరుచుపడుతోంది రష్యా. ఫిబ్రవరిలో ప్రారంభమై యుద్ధం ఐదు నెలలకు చేరుకుంది. రష్యా ఉక్రెయిన్ భూభాగాన్ని నెమ్మదిగా ఆక్రమిస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని 20 శాతం భూభాగం రష్యా ఆధీనంలోకి వెళ్లింది. ముఖ్యంగా డాన్ బాస్, లుహాన్స్క్ ప్రాంతాలపై రష్యా పట్టు సాధిస్తోంది. అక్కడి నగరాలను నెమ్మదిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటోంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై మరోసారి రష్యా బలగాలు విరుచుకుపడ్డాయి. గత మూడు వారాలుగా కీవ్ పై ఎలాంటి దాడి…