విశాఖపట్నం పర్యటనలో ఉన్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్... గత ప్రభుత్వ హయాంలో రుషికొండపై నిర్మించిన ప్యాలెస్‌ను పరిశీలించారు.. జనసేనకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి రుషికొండ ప్యాలెస్‌ను తిలకించారు పవన్.. ప్రకృతితో పెట్టుకుంటే ఉన్నది పోద్ది" అంటారు.. సంవత్సరానికి 7 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వచ్చే రుషికొండపై 1 కోటి రూపాయలు కేవలం కరెంటుకే వెచ్చించే స్థితికి తెచ్చారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు..
రుషికొండ నిర్మాణాలు చూస్తే గుండె చెదిరే నిజాలు వెలుగు చూస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అధికారం అడ్డు పెట్టుకొని చేసే తప్పులకు ఇదో కేస్ స్టడీ అంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటివి సాధ్యమా అనిపించిందని.. కలలో కూడా ఊహించలేమన్నారు. ఇటువంటి నేరాలు చెయ్యాలంటే చాలా తెగించాలి.. ఒక వ్యక్తి విలాసాల కోసం ఇంత దారుణమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చాలా దేశాలు తిరిగానని, పాలకులను చూశాను కానీ ఒక సీఎం విలాసం…