రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మా ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుందని.. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మారీచుడు వచ్చి అడ్డుకున్నా రైతు భరోసా ఆగదన్నారు. భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రైతుభరోసాపై కేబినెట్ సబ్‌కమిటీ వేశామని.. మా ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుందని తెలిపారు.
రైతులు సంతోషంగా ఉంటే బీఆర్‌ఎస్ నేతలకు నిద్రపట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన చరిత్ర ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. రుణమాఫీపై చర్చకు కేసీఆర్, మోడీ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఏడాదిలోనే 25 లక్షల రైతుల కుటుంబాలకు 21 వేల కోట్ల రుణమాఫీ చేసిన రాష్ట్రం ఉందా అంటూ ప్రశ్నించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా 18 వేల కోట్లు రైతుకు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. పాలమూరు సభ ద్వారా మరో రూ. 3 వేల కోట్లు ఇవ్వబోతున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడారు.
రైతులు తీసుకొచ్చిన పత్తిలో కోత విధిస్తే సహించబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. వేబ్రిడ్జి కాటాలో తేడా వస్తే మిల్లు సీజ్ చేయిస్తామన్నారు. ఈ సంవత్సరం అధిక వర్షాలతో పత్తి పంట నష్టపోయారని చెప్పారు. రెండు లక్షల ఎకరాల్లో 20 టన్నుల పంట ఉత్పత్తి అవుతుందని.. తొమ్మిది సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు.
Ponguleti Srinivasa Reddy: భద్రాద్రి జిల్లా మణుగూరులో జరిగిన సమీక్ష సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా అయన మాట్లాడుతూ.. అధికారులు దొరల పాలనలో ఉన్నామనేది మర్చిపోండి. ప్రజా పాలనలో ఉన్నాం. దొరల పాలనలో ఉన్నామనుకుంటే ఈ ప్రభుత్వం ఉపేక్షించదని అన్నారు. అలాగే రాష్ట్రంలో 1251 నియోజకవర్గాల్లో కార్పోరేటర్ల తలతన్నెల ఇంటిగ్రేటెడ్ పాఠశాల శంకుస్థాపనలు చేశామని.. అర్హులైన రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పనట్లు తెలిపారు. గత ప్రభుత్వం గడిచిన…
రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. వారంలోపు మిగిలిన వారందరికీ రైతు రుణమాఫీ పూర్తి అవుతుందని వెల్లడించారు. నల్గొండ జిల్లా నల్గొండ మండలం అర్జాలబావి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు.
రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరితా, విజయారెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేయటాన్నిభారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్ లపై దాడి చేయటం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇందిరమ్మ పాలనగా ఫోజులు కొట్టే రేవంత్ రెడ్డి… మీ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ‘ఇద్దరు మహిళ జర్నలిస్ట్…
డిసెంబర్‌లో రుణమాఫీ చేస్తామని చెప్పి జూలైలోనే రుణమాఫీ మొదలు పెట్టామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారికి త్వరలో రుణమాఫీ చేస్తామన్నారు. లక్షా 20 వేల మంది రైతులు ఆధార్ నంబర్లు తప్పుగా ఇచ్చారని.. లక్షా 61 వేల రైతుల ఆధార్ కార్డుల్లో, అకౌంట్స్‌లో పేర్లు తప్పులు ఉన్నాయన్నారు.
రుణమాఫీపై పత్రికల్లో వచ్చిన వార్తలు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున వైరాలో 2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు.
చాలా మంది రైతులకు రుణమాఫీ జరగలేదంటూ బీజేపీ నాయకులు ఒక ప్రకటన విడుదల చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేయడం నిజంగా విడ్డూరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు