పశ్చిమ సూడాన్‌లోని ఉత్తర డార్ఫర్ రాష్ట్ర రాజధాని ఎల్ ఫాషర్‌లో గత రెండు రోజుల్లో రెండు శిబిరాలపై పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 114 మందికి పైగా పౌరులు మరణించారు. ఏప్రిల్ 12న జామ్జామ్ శిబిరంపై ఆర్‌ఎస్‌ఎఫ్ మిలీషియా జరిపిన దారుణ దాడిలో 100 మందికి పైగా పౌరులు మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు ని నార్త్ డార్ఫర్ రాష్ట్ర ఆరోగ్య అథారిటీ డైరెక్టర్ జనరల్ ఇబ్రహీం ఖైటర్ జిన్హువా…