Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో 25కోట్ల రూపాయల పంచాయతీ కాక రేపుతూనే ఉంది. మునుగోడు ఉప ఎన్నిక టైంలో అధికార బీఆర్‌ఎస్ నుంచి తెలంగాణ కాంగ్రెస్‌కు పాతిక కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించడం,.. దాన్ని కౌంటర్ చేస్తూ… పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయడంతో…రాజకీయం హీటెక్కింది. ఆ తర్వాత 25 కోట్లు వ్యక్తిగతంగా రేవంత్‌కి ఇచ్చారని మేము ఆనలేదంటూ..ఈటెల, బండి సంజయ్ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌లో…