ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆర్థికంగా కుదురుకునేందుకు కేంద్రం మరో అవకాశం కల్పించింది. అప్పులపై ఆధారపడుతూ అమలు అవుతున్న సంక్షేమ పథకాలకు.. మరో ఉతం అందింది. వచ్చింది చిన్నదైనా.. కనీసం నెలో.. రెండు నెలలో మెయింటైన్ చేయగలిగేలా.. ఆర్థిక వనరులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమకూర్చుకుంటోంది. ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంకు నుంచి 2 వేల కోట్ల రూపాయలను అప్పు రూపంలో జగన్ ప్రభుత్వం అందిపుచ్చుకుంది. తాజాగా.. కేంద్రం ఏపీకి 1438 కోట్ల రూపాయలను అందించింది. రెవెన్యూ లోటును భర్తీ చేసే…