ఐపీఎల్ మెగా వేలంలో ఎంతగానో ఎదురు చూసిన అతి పిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీ అమ్ముడుపోయాడు. 13 ఏళ్ల ఈ కుర్రాడిని రాజస్థాన్ రాయల్స్‌ను అనుకున్న ధర కంటే ఎక్కువగానే కొనుగోలు చేసింది. బీహార్‌కు చెందిన వైభవ్ కోసం ఢిల్లీ, రాజస్థాన్ పోటీ పడ్డాయి. అతని బేస్ ప్రైస్ రూ. 30 లక్షలు. చివరకు ఆర్ఆర్ జట్టు ఇతన్ని రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది.