ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పిరియాడికల్ యాక్షన్ డ్రామా “ఆర్ఆర్ఆర్”.. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పై డివివి దానయ్య అత్యంత్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సముద్రకని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది.…