రాజమౌళిని ఉద్దేశించి బిడ్డ నువ్వు కనుక సినమా రిలీజ్ చేస్తే ఉరికిచ్చి కొడతాం అని ఈ మూవీ మీద వివదాస్పద కామెంట్స్ చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో సినిమా యూనిట్, డైరెక్టర్ ని ప్రశంసిస్తూ ట్వీట్ పెట్టడంతో నెటిజన్స్ తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.
తెలుగు చలనచిత్ర ఖ్యాతిని RRR చిత్రం విశ్వవ్యాప్తం చేసిందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తరుపున RRR బృందానికి సన్మానం చేయాలని నిర్ణయించామని తెలిపారు.
Prem Rakshith:సాధారణంగా ప్రేక్షకుల ముందుకు ఒక పాటను తీసుకురావడానికి ఎంతోమంది ఎన్నో విధాలుగా కష్టపడతారు. లిరిక్స్, మ్యూజిక్, డ్యాన్స్.. క్యాస్టూమ్స్..డైరెక్షన్.. ఇందులో ఏది తక్కువ అయినా ఆ సాంగ్ ప్రేక్షకులకు అంతగా ఎక్కదు. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ లో ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టే అది ఆస్కార్ లాంటి గొప్ప అవార్డు ను అందుకోగలిగింది.
Oscar 2023: కళా ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన అవార్డు ఆస్కార్. 90 ఏళ్లకు పైగా ఆస్కార్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. సినీ పరిశ్రమలోని నటులు ఒక్క సారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటారు.
Oscar 2023: ఆస్కార్.. ఆర్ఆర్ఆర్.. అవార్డులు.. గ్లోబల్ హీరోలు.. ఎన్టీఆర్.. చరణ్.. రాజమౌళి.. నాటు నాటు.. గత కొన్ని రోజులుగా ఈ పేర్లన్నీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆస్కార్ కు ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన విషయం తెల్సిందే.
RRR: ఆస్కార్ నామినేషన్స్ లో మన 'ట్రిపుల్ ఆర్' ఒకే ఒక్క 'ఒరిజినల్ సాంగ్' కేటగిరీలోనే నామినేషన్ సంపాదించింది. 'ట్రిపుల్ ఆర్' కోసం కీరవాణి బాణీలకు అనువుగా చంద్రబోస్ రాసిన "నాటు నాటు..." పాట ఈ గౌరవంతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులూ సంపాదించింది. అయితే ఆస్కార్ అవార్డు దక్కితే వచ్చే ఆ కిక్కే వేరబ్బా అంటున్నారు అభిమానులు.
ఈ సారి భారతీయులకు 'ట్రిపుల్ ఆర్'లోని "నాటు నాటు..." సాంగ్ ఎంత ఆనందం పంచిందో, అదే తీరున 'ఆస్కార్ నామినేషన్' సైతం సొంతం చేసుకొని మరింత ఉత్సాహాన్ని ఉరకలేయిస్తోంది.