Oscar 2023: ఆస్కార్.. ఆర్ఆర్ఆర్.. అవార్డులు.. గ్లోబల్ హీరోలు.. ఎన్టీఆర్.. చరణ్.. రాజమౌళి.. నాటు నాటు.. గత కొన్ని రోజులుగా ఈ పేర్లన్నీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆస్కార్ కు ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన విషయం తెల్సిందే. మార్చి 12 న జరగబోయే ఈ వేడుకలు కోసం చిత్ర బృందం మొత్తం అమెరికాలో వాలిపోయారు. ఇంటర్నేషనల్ సినిమాలతో తలపడి.. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కొడుతుందా లేదా..? అనేది పెద్ద మిస్టరీగా మారింది. అందుకే ప్రతి భారతీయుడు మార్చి 12 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. ఇక ఆస్కార్ వేదికపై మనవాళ్ళు అవార్డు తీసుకొంటే వచ్చే ఆనందం మాటలో చెప్పలేం.. అరెరే.. అలా చూడలేమే.. ఆస్కార్ లైవ్ మన ఇండియాలో ఉండదు కదా.. అని నిరుత్సాహపడకండి. ఈసారి ఆస్కార్ ను మనం లైవ్ చూడొచ్చు.
Ram Charan: స్టార్ అయినా.. మెగా పవర్ స్టార్ అయినా భార్య బ్యాగ్ లు మోయాల్సిందే
అవునా.. నిజమా అంటే.. అవును.. నిజమే. డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. ఆస్కార్ 2023 వేడుకను లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించారు. మార్చి 12 న ఈ కార్యక్రమాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లైవ్ చూడొచ్చు అని చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులు ఎగిరిగంతేస్తున్నారు. ఈ వేదికపై చరణ్, తారక్.. నాటు నాటు సాంగ్ కు స్టెప్స్ కూడా వేయనున్నారట..ఇంటర్నేషనల్ వేదికపై మన తెలుగు స్టార్ హీరోలు స్టెప్స్ వేస్తుంటే.. అక్కడ ఉన్నవారు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనం లైవ్ లో చూసే అవకాశం కూడా ఉంది. ఇక ఈ విషయం తెలియడంతో ఎప్పుడెప్పుడు ఈ ప్రోగ్రాం వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇండియా మ్యాచ్ ఓడిపోతే టీవీలు ఎలా పగులకొడతారో.. ఆర్ఆర్ఆర్ కు అవార్డు రాకపోతే మనోళ్లు టీవీలు పగులకొడతారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.. మరి ఆర్ఆర్ఆర్ అవార్డు అందుకుంటుందా లేదా అనేది చూడాలి.