రాజస్థాన్ పేపర్ లీక్ కేసులో ఈడీ కీలక చర్యలు తీసుకుంది. రాజస్థాన్ పబ్లిక్ కమిషన్ సభ్యులు అనిల్ కుమార్ మీనా, బాబులాల్ కటారాలను అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. మూడు రోజుల పాటు ఈడీ కస్టడీ కోరింది.