ఐపీఎల్ 2024లో భాగంగా.. ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ 187 పరుగులు చేసింది. ఢిల్లీ ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 187 రన్స్ సాధించింది. బెంగళూరు బ్యాటింగ్ లో అత్యధికంగా రజత్ పాటిదర్ (52) పరుగులతో రాణించాడు. ఆ తర్వాత విల్ జాక్స్ (41), కెమెరాన్ గ్రీన్ (32*) పరుగులు చేయడంతో ఢిల్లీ ముందు ఫైటింగ్ స్కోరును ఉంచారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రెండో మ్యాచ్ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
మే 12న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆడుతుంది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 మ్యాచ్ లలో 5 గెలిచింది, ఇప్పుడు ప్లేఆఫ్ లకు అర్హత సాధించడానికి అవకాశం పొందడానికి తదుపరి 2 గేమ్ లను తప్పక గెలవాలి. ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వారి చివరి 5 మ్యాచ్ లలో…
ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. 60 పరుగుల తేడాతో బెంగళూరు గెలుపొందింది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. 16 ఓవర్లలో 181 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలవడంపై ఇంకా ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. పంజాబ్ బ్యాటింగ్ లో రిలీ రోసో అత్యధికంగా 61 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ధర్మశాల వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 148 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.4 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఒకానొక సమయంలో ఆర్సీబీ వికెట్లు పోతున్న సమయంలో గుజరాత్ వైపు మ్యాచ్ తిరిగింది. కానీ.. దినేశ్ కార్తీక్ క్రీజులోకి వచ్చి మ్యాచ్ను గెలిపించాడు. బెంగళూరు బ్యాటర్లలో కోహ్లీ (42), డుప్లెసిస్ (64) పరుగులు చేయడంతో ఆర్సీబీ అలవోకంగా విజయం సాధించింది.
ఐపీఎల్ 2024లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ పోటీ పడబోతుంది. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. తన బర్త్ డేను ఆర్సీబీ ప్లేయర్లతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. అందులో విరాట్, అనుష్కతో పాటు ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ దంపతులు హాజరై సందడి చేశారు. కాగా.. ఈ నెల 1న అనుష్క పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫొటోలు బయటకొచ్చాయి. కుమారుడు అకాయ్‌కు జన్మనిచ్చిన తర్వాత అనుష్క ఫొటోకు…
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఏప్రిల్ 21న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ మొత్తం 6 మ్యాచ్ లలో 4 గెలిచి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన 7 మ్యాచ్ లలో 1 మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. నేటి మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.…