సార్వత్రిక ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన వారిపై కడప పోలీసులు ఉక్కు పాదం మోపారు. ఎన్నికల సందర్భంగా నేరాలకు పాల్పడ్డ 40 మందిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల్లో ఉన్న వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అనంతపురం జిల్లాలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పోలింగ్ రోజు, తరువాత తలెత్తిన హింసాత్మక ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా దాడుల్లో పాల్గొన్న 159 మందిపై
జిల్లా పోలీసులు రౌడీషీట్ ఓపెన చేశారు.