నేను వచ్చిన వెంటనే చెత్త తొలగించా.. చెత్త నేతలను కూడా అలాగే తొలగిస్తాను అంటూ రౌడీషీటర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మాచర్లలో ఉండే రౌడీలు, ముఠా నాయకులు ప్రజల ఆస్తులను దోచేశారు. చరిత్రలో ఉన్న డిక్టేటర్లకు పట్టిన గతే వారికి పట్టిందన్నారు.. ఆత్మకూరు బాధితులను ఆదుకునేందుకు కూడా నన్ను రానివ్వకుండా నా ఇంటికి తాళ్లు కట్టారు. ఆరోజే చెప్పా... మీకు ఉరితాళ్లే అని.. మున్సిపల్ ఎన్నికలలో దౌర్జన్యం చేసినప్పుడే చెప్పా ఖబడ్దార్…
మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో వెలుగు చూసింది. నోయిడాలోని పండ్ల మార్కెట్‌లో కూరగాయల అమ్మకందారుడు ఓ వ్యక్తి దగ్గర రూ. 3000 అప్పుగా తీసుకున్నాడు. అయితే తన డబ్బులు ఇవ్వాలంటూ తీవ్రంగా కొట్టాడు.. అంతేకాకుండా అతని బట్టలూడదీసి మార్కెట్ మొత్తం తిప్పాడు.