భారతీయ రైల్వే త్వరలో 20 కోచ్‌ల వందే భారత్ రైలును తీసుకురానుంది. ఈ రైలు ఢిల్లీ నుంచి కొన్ని నిర్దిష్ట మార్గాల్లో నడువనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న రద్దీ, పండుగల దృష్ట్యా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు భారత్లో క్రేజ్ పెరుగుతుండడం గమనార్హం.