మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. అయితే రేపు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద గోదావరిలో రోశయ్య అస్తికలు నిమజ్జనం చేయనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అస్తికలను కుటుంబ సభ్యులు రాజమండ్రికి తీసుకురానున్నారు. రేపు రోశయ్య అస్తికల నిమజ్జనం సందర్భంగా వర్తక, వ్యాపార వర్గాలు ఈ కార్యక్రమంలో పాల్గొని సంతాపం తెలపాలని…
రోశయ్య మరణం కాంగ్రెస్ నేతలను కలిచి వేసిందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. పీసీసీ, పీఏసీ జాయింట్ సమావేశంలో రైతు సమస్యలపై చర్చించాలని అనుకున్నామని, కానీ రోశయ్య మరణంతో ఆయన మరణం పైనే చర్చించామని షబ్బీర్ అలీ మీడియాకు తెలిపారు. రోశయ్య మరణం కాంగ్రెస్ నేతలను కలిచి వేసిందన్నారు.ఈ రోజు సమావేశంలో రోశయ్య సేవలు, మరణంపైనే చర్చించినట్టు తెలిపారు. రేపు గాంధీ భవన్ లో 11 నుండి 12 వరకు రోశయ్య పార్థివ దేహాన్ని వుంచనున్నట్టు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (88) పార్ధీవ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.మరణవార్త తెలిసిన వెంటనే హైదరాబాద్‌లోని రోశయ్య నివాసానికి చేరుకుని రోశయ్య పార్థీవ దేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి, నివాళులర్పించారు.బాధలో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆర్థిక శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా పలు పదవులకు…