ఐపీఎల్ 2024కు సమయం ఆసన్నమైంది. మార్చి 22న ఆరంభం మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. మార్చి 24న గుజరాత్ టైటాన్స్‌ను ముంబై ఇండియన్స్ తన మొదటి మ్యాచ్‌లో ఢీకొట్టనుంది. ఈ సీజన్‌లో హార్దిక్ పాండ్యా ముంబైకి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 5 సార్లు ముంబైని ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ.. కేవలం బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. ముంబై కెప్టెన్సీ మార్పు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.…