Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు తదుపరి డైరెక్టర్‌గా భారతీయ మూలాలున్న జై భట్టాచార్యను ఎంపిక చేశారు.