“ఐరన్ మ్యాన్” రాబర్ట్ డౌనీ జూనియర్ తన తండ్రి మరణంతో విషాదంలో మునిగిపోయారు. దిగ్గజ చిత్రనిర్మాత, నటుడు రాబర్ట్ డౌనీ సీనియర్ గత రాత్రి నిద్రలోనే మరణించినట్టు ఆయన తనయుడు రాబర్ట్ జూనియర్ ప్రకటించారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. డౌనీ జూనియర్ తన తండ్రిని “ట్రూ మావెరిక్ ఫిల్మ్ మేకర్” అని అన్నాడు. డౌనీ సీనియర్ గత కొన్ని సంవత్సరాలుగా పార్కిన్సన్ వ్యాధితో పోరాడుతున్నాడు. 1936లో జన్మించిన డౌనీ సీనియర్ మూడుసార్లు వివాహం చేసుకున్నాడు. న్యూయార్క్…