సంక్రాంతికి ముందే కోనసీమలో రాజకీయ పందెంకోళ్లు సెగ పుట్టిస్తున్నాయా? రోడ్డు పనులపై రచ్చ రంబోలా అవుతోందా? వైసీపీ, టీడీపీ నేతల సవాళ్లు.. విమర్శలు.. అవినీతిలో కొత్తకోణాన్ని ఆవిష్కరిస్తున్నాయా? రాజకీయంగా వేడెక్కిస్తున్న అంశాలేంటి? తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం-కొత్తపేట రోడ్డు నిర్మాణ పనులు రాజకీయంగా హీటెక్కిస్తున్నాయి. పది కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం అనేక మలుపులు తిరిగి వైసీపీ, టీడీపీ మధ్య రచ్చ రచ్చ అవుతోంది. అధ్వాన్నంగా తయారైన ఈ రహదారికి మరమ్మతులు చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీలు…