ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బైకులు, కార్లు, ఇతర వాహనాలను జాగ్రత్తగా చూసుకుంటుంటారు. అవి పాడైపోయాక కూడా ఇంట్లోనే భద్రంగా భద్రపరుచుకుంటుంటారు. వాటిని కుటుంబ సభ్యులుగా భావిస్తుంటారు. ఈ క్రమంలో గుజరాత్‌లోని ఖేడా జిల్లాలోని నదియాద్‌లోని ఉత్తర్సంద గ్రామంలో ఒక భావోద్వేగ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో బైక్ ప్రియుడైన యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించగా అతని కుటుంబం అతని బైక్‌తో అంతిమ వీడ్కోలు పలికింది. అంత్యక్రియలు నిర్వహిస్తున్నప్పుడు, కుటుంబం అతనికి ఇష్టమైన బైక్‌తో పాతిపెట్టాలని నిర్ణయించుకుంది. అతను…
కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం కొమరగిరిలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే నవ దంపతులు యాక్సిడెంట్లో మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఆర్కే బీచ్‌కి వెళ్తుండగా బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఇద్దరి మృతితో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read: Tomato-Uji: ఊజీ ఈగ దెబ్బ.. టమోటాను పడేస్తున్న రైతులు!…
కర్నాటకలో హోసకోట్ సమీపంలోని గొట్టిపుర గేట్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురు మృతిచెందారు.. తిరుపతి నుండి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసి బస్సు ఓవర్ టెక్ చేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.. దీంతో, బస్సులో ఉన్న కేశవరెడ్డి (44), తులసి (21), ప్రణతి (4) మరియు (1) సంవత్సరం చిన్నారి కూడా ప్రాణాలు విడిచింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. రాజమండ్రి – కాకినాడ ఏడీబీ రోడ్డుపై వడిశలేరు దగ్గర చోటు చేసుకున్న ప్రమాదంలో ఐదుగురు చనిపోయారని తెలిసి చింతిస్తున్నాను.. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమైంది.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అన్నారు.
Nigeria: నైజీరియాలో తాజాగా ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఓగున్ రాష్ట్రంలోని జాతీయ క్రీడలను ముగించుకుని తిరిగివస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో 21 మంది క్రీడాకారులు, అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నైజీరియా క్రీడా ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఈ దుర్ఘటన శనివారం చోటు చేసుకుంది. ప్రమాదం కానోకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దకాసోయే పట్టణం వద్ద జరిగింది. ఓగున్ రాష్ట్ర రాజధాని అబేఒకుటా నుంచి ప్రయాణిస్తున్న కోస్టల్ బస్సు రాత్రంతా ప్రయాణించి…
మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. షాద్ నగర్ లో మక్తల్ ఎమ్మెల్యే వాహనానికి ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వైపు వెళ్తున్న TG 38 6669 నెంబర్ గల ఇన్నోవా కారును పక్కన నుంచి వస్తున్న ఐ 20 కారు వేగంగా ఢీకొట్టింది. షాద్ నగర్ రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఎమ్మెల్యే కారు స్వల్పంగా ధ్వంసం అయ్యింది. ఈ…
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం రాజమండ్రి ఆటోనగర్ సమీపంలోని కొంతమూరు వద్ద జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. Also Read: Gold Rate Today: మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు! ప్రమాద సమయంలో కారులో…
కడపలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు స్పాట్లోనే మృతిచెందారు.. కడప గువ్వల చెరువు ఘాట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.. కారు-లారీ ఢీకొన్న ఈ ప్రమాదంలో.. ఒక్కసారిగా కారుపై పడిపోయింది లారీ.. దీంతో.. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందారు..
Accident: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం ఓసి 2 సమీపంలో నేషనల్ హైవే పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది..ఈ ప్రమాదంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందు క్యాబిన్ భాగం పూర్తిగా ధ్వంసం అయింది..బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయి క్యాబిన్ లో ఇరుక్కుపోయ్యారు..మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావటంతో స్థానికులు సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు.…
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. డివైడర్‌ను ఢీకొట్టిన అనంతరం బస్సు కొంత దూరం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 35 మందికి గాయాలు అయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులో ఇరుక్కున్న వారిని బయటకు పోలీసులు, స్థానికులు బయటికి తీశారు. క్షతగాత్రులు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. Also Read: IPL 2025: నాలుగు నగరాల్లోనే…