Road Accident: ఆదివారం (సెప్టెంబర్ 7) ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గుడిమల్కాపూర్ కు చెందిన రేణుక అనే జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికురాలు తన విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదానికి గురై మృతికి కారణమైంది. గత 15 ఏళ్లుగా జిహెచ్ఎంసిలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్న రేణుక, బషీర్ బాగ్ నుండి లిబర్టీ దిశగా మార్గంలో పని నిర్వహించుకుంటోంది. ఈ క్రమంలో రోడ్డును దాటేందుకు యత్నించగా, అదే సమయంలో బషీర్ బాగ్ నుండి వస్తున్న టస్కర్…
లండన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. వినాయక నిమజ్జనానికి వెళ్లి.. తిరిగి వస్తుండగా రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వాసులు నాదర్‌గుల్‌కు చెందిన తర్రె చైతన్య యాదవ్ (23), ఉప్పల్‌కు చెందిన రిషి తేజ (21) అక్కడిక్కడే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గురైన వారందరూ తెలుగు…
Barabanki Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 35 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బారాబంకి-బహ్రైచ్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. బారాబంకిలో యాత్రికులను తీసుకెళ్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. గోండాలోని దుఖ్హరన్ నాథ్ మహాదేవ్ ఆలయంలో ప్రార్థనలు చేసి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. Also Read: Viral Video: ఢిల్లీ…
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బులంద్‌షహర్‌లోని జాతీయ రహదారి 34లోని ఘటల్ గ్రామం సమీపంలో, రాజస్థాన్‌లోని కాస్‌గంజ్ నుంచి గోగామెడికి వెళ్తున్న గోగాజీ భక్తులతో బయలుదేరిన ట్రాక్టర్‌ను కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న 8 మంది మరణించగా, 43 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 60 మంది భక్తులు ఉన్నారని బులంద్‌షహర్ ఎస్‌ఎస్‌పి దినేష్ కుమార్ సింగ్ తెలిపారు. Also Read: Saudi hero: ఆ వ్యక్తి ధైర్యసాహసాలకు…
ఇటీవల అనారోగ్య కారణాలతో కన్నుమూసిన కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి, ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ నివాసంలో కన్నుమూశారు. నిజానికి, కోట శ్రీనివాసరావు ఉన్నప్పటి నుంచే ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. చాలా కాలం నుంచే రుక్మిణి అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక, ఈ రోజు తెల్లవారుజామున ఆమె మరణించినట్లు సమాచారం. Also Read:Harinya Reddy: బిగ్ బాస్ కీలక టీం మెంబర్, ప్రొడ్యూసర్.. రాహుల్ చేసుకోబోయే అమ్మాయి షాకింగ్ బ్యాక్ గ్రౌండ్ ఇక, కొద్దిసేపటి క్రితమే…
Road Accident: పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బర్దమాన్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తీర్థయాత్రికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు రోడ్డు పక్కన నిలిచి ఉన్న ట్రక్‌ను వెనుకనుంచి ఢీకొనడంతో 10 మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం తూర్పు బర్దమాన్‌లోని జాతీయ రహదారి (NH -19) పై నలా ఫెరీఘాట్ వద్ద ఉదయం సుమారు 7.30 గంటలకు చోటుచేసుకుంది. Suspicious Death: హత్యా? ఆత్మహత్యా?…
పండుగ పూట కొన్ని విషాద ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో తన చెల్లి వద్దకు రాఖీ కట్టించుకోవడానికి వెళ్తూ.. అనంత లోకాలకు చేరాడు ఓ యువకుడు..
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లా డోన్ పర్యటనకు వెళ్లారు.. అయితే, వైఎస్ జగన్ డోన్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది.. వెల్దుర్తి హైవేపై టైరు పేలి ట్రాలీ ఆటో బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో ఆరుగురి పరిస్థితి విషమంగా మారగా.. మొత్తం 30 మందికి గాయాలు అయ్యాయి..
Road Accident: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చౌరస్తాలో ఈ రోజు (జులై 26) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై కాలేజ్‌కు తీసుకెళ్తున్న కూతురు మైత్రి(19), తండ్రి మచ్చందర్(55)ను ఓ ట్యాంకర్ వాహనం ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలోని మృతులు షాద్ నగర్‌కు చెందినవారిగా గుర్తించారు. మైత్రిని కాలేజ్‌కు పంపించేందుకు మచ్చందర్ బైక్‌పై తీసుకెళ్తుండగా.. షాద్ నగర్ చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన ఓ ట్యాంకర్ వారి పైకి దూసుకొచ్చింది. ఆలా వాహనం ఢీకొన్న…