మూడు నెలల విరామం తర్వాత టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మైదానంలోకి తిరిగి వచ్చాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో దక్షిణాఫ్రికా-ఏతో జరుగుతున్న నాలుగు రోజుల మొదటి మ్యాచ్‌లో పంత్ ఆడుతున్నాడు. భారత్-ఏ జట్టు సారథిగా వ్యవహరిస్తున్న పంత్.. బ్యాటింగ్ చేయకముందే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. ఇందుకు కారణం అతడు టీమిండియా స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జెర్సీ ధరించడమే. దక్షిణాఫ్రికా-ఏతో మ్యాచ్‌లో టాస్ నెగ్గిన రిషభ్ పంత్ బౌలింగ్…