మాజీ సీఎం రోశయ్య పార్థివదేహానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం కిరణ్ మాట్లాడుతూ… రోశయ్య వాగ్థాటిని తట్టుకోలేక ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేశారన్నారు. ఎన్నో పదవులు అలంకరించిన వ్యక్తి రోశయ్య. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలనేది రోశయ్యను చూసి నేర్చుకున్నామని కిరణ్తె కుమార్లి పారు. ఏ పదవి చేసినా.. ఆ పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి రోశయ్య అని కిరణ్ కుమార్ రెడ్డి కొనియాడారు. రోశయ్య వాగ్దాటిని తట్టుకోలేక కౌన్సిల్ రద్దుచేయాల్సిన పరిస్థితి ఆనాడు…
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆకస్మిక మరణం తెలుగు రాష్ట్రాలకు తీరనిలోటు అన్నారు మాజీ సీఎం చంద్రబాబునాయుడు. ఆయన వాగ్దాటి, కంచుకంఠం మారుమోగుతూనే వుంటుందన్నారు చంద్రబాబు. ఆయనతో కలిసి పనిచేసిన రోజుల్ని బాబు గుర్తుచేసుకున్నారు. ఏ పదవిలో ఉన్నా రాణించిన వ్యక్తి రోశయ్య. ఆయన అజాత శత్రువు.కాంగ్రెస్ పార్టీకి రోశయ్య పెద్ద ఆస్తిగా ఉండేవారు. క్లిష్ట సందర్భాల్లో అసెంబ్లీలో రోశయ్య పాత్ర కీలకం.16 సార్లు బడ్జెట్ పెట్టిన చరిత్ర రోశయ్యది.రాజకీయంగా రోశయ్యతో విభేదించే వాళ్ళం.. కానీ…