యునిసెఫ్ ( యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్-UNICEF ) ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి కరీనా కపూర్‌ను నియమించారు. ఈ విషయాన్ని యునిసెఫ్ శనివారం ప్రకటించింది. 2014 నుంచి ఆమె యునెసెఫ్ సెలబ్రిటీ అడ్వకేట్‌గా కొనసాగుతున్నారు. మే 4న (శనివారం) ఆమె నియామకం ఖరారైంది.