Supreme Court: వైవాహిక వివాద కేసులో జీవిత భాగస్వామి టెలిఫోన్ సంభాషణల్ని రహస్యంగా రికార్డ్ చేయడం ఆమోదయోగ్యమైన సాక్ష్యమని సుప్రీంకోర్టు సోమవారం ఓ కేసులో తీర్పు చెప్పింది. జీవిత భాగస్వామి టెలిఫోన్ సంభాషణల్ని రహస్యంగా రికార్డు చేయడం గోప్యత హక్కును ఉల్లంఘిస్తుందని, కుటుంబ కోర్టులో సాక్ష్యంగా అంగీకరించలేమని పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పున సుప్రీంకోర్టు పక్కన పెట్టింది.
High Court: చత్తీస్‌గఢ్ హైకోర్టు.. కుటుంబ న్యాయస్థానం ఆదేశాలను రద్దు చేస్తూ.. భార్యాభర్తలైనా సరే ఎవరైనా ఒకరి ఫోన్ కాల్ మరొకరు తెలియకుండా మొబైల్ సంభాషణను రికార్డ్ చేయడం గోప్యతను ఉల్లంఘించడమేనని పేర్కొంది.
Supreme Court: వివాహేతర సంబంధాలను రుజువు చేయడానికి ఒక వ్యక్తికి సంబంధించిన హోటల్ వివరాలు, కాల్ డేటాను అడగొచ్చ అనే అంశాన్ని పరిశీలించేందుకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది.