Basara IIIT : ఆర్జీయూకేటీ బాసర, మహబూబ్ నగర్ సెంటర్ లలో ఆరు సంవత్సరాల సమీకృత విద్యా విధానంలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించుటకు అడ్మిషన్ నోటిఫికేషన్ ను వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ విడుదల చేశారు. గ్రామీణ పేద విద్యార్థులకు 2008వ సంవత్సరంలో ప్రారంభించిన ఈ విశ్వవిద్యాలయం సాంకేతిక విద్యను అందించడమే లక్ష్యంగా ఏర్పాటయిందని, తదనుగుణంగా ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్నామని తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పేద విద్యార్థులు పొందుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. నోటిఫికేషన్ వివరాలు డబ్ల్యు…
బాసర ఆర్జీయూకేటీ ప్రవేశ దరఖాస్తు గడువు పొడిగించారు. నేటితో(జూన్ 19) దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియగా.. విద్యార్థుల అభ్యర్థనల మేరకు ఈనెల 22 వరకు దరఖాస్తు స్వీకరణ గడువు పొడిగిస్తున్నట్లు డైరెక్టర్ సతీష్‌కుమార్ తెలిపారు. దీంతో అర్హులైన మరికొందరు విద్యార్థులు 22 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ లో 5 వ స్నాతకోత్సవంలో మంత్రులు కేటిఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన హామీల అమలు పై ట్రిపుల్ ఐటీ అధికారులను ప్రశ్నించారు మంత్రి.
Basara IIIT students are facing problems due to power cut: బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలు తీరడంలేదు. బాసర ట్రిపుల్ ఐటీ ట్రబుల్ ఐటీగా మారింది. ఎంత మందికి విద్యార్దులు వారి సమస్యలను చొప్పుకున్నా. సరా మామూలుగానే వుంటోంది. కలుషిత ఆహారం, సరైన సౌకర్యాలు లేవని అధికారులకు విన్నవించిన మాటలవరకే పరిమితం చేస్తున్నారు. ఎండ, వాన అని తేడా లేకుండా సమస్యలు పరిష్కారం కోసం సమ్మెలు చేసిన పరిష్కార మార్గం కనిపించలేదు. మెస్ లో…
కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిందే బాసరలోని ఆర్టీయూకేటీ. కొన్నేళ్లుగా నిర్వహణ లోపంతో సమస్యలు చుట్టుముట్టాయి. కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్న క్రమంలో ఒక్కో సమస్య వెలుగులోకి వస్తోంది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం కోసం ఎన్టీవీ సాహసం చేసింది. సమస్యల సుడిగుండంలో ఉన్న విద్యార్థులను ఎన్టీవీ బృందం పలకరించింది. దారుణమైన పరిస్థితి ఉందంటూ ఎన్టీవీతో విద్యార్థులు గోడు వెళ్లబోసుకున్నారు. బాసర ట్రిపుల్…
బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థులు చేస్తోన్న ఆందోళనకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంఘీభావం ప్రకటించారు. విద్యార్థుల వాస్తవ డిమాండ్‌లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. సిల్లీ అని కొట్టిపారేయటం విస్మయాన్ని కలిగిస్తుందని సామాజిక మాధ్యమం వేదికగా రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు అందించిన ఎనలేని కృషిని సీఎం మరిచిపోయారా..? అని ప్రశ్నించారు. బాసర ట్రిపుల్ఐటీ క్యాంపస్‌లో దయనీయమైన పరిస్థితులను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఎం కేసీఆర్…