Kolkata Student Case: కోల్‌కతా లా కాలేజీ క్యాంపస్‌లో 24 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. నిందితుల్లో ఒకరు అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) విద్యార్థి విభాగం నేత కావడంతో ఈ కేసు రాజకీయంగా చర్చకు దారి తీసింది. గతేడాది ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో పీజీ వైద్యురాలిపై అత్యాచార ఘటన మరిచిపోక ముందే ఈ సంఘటన జరిగింది.
Kolkata law student case: కోల్‌కతాలో 24 ఏళ్ల లా విద్యార్థినిపై క్యాంపస్‌లోనే సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన బెంగాల్లో రాజకీయ చర్చకు దారి తీసింది. ప్రతిపక్ష బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడి చేస్తోంది. ముగ్గురు వ్యక్తులు కలిసి విద్యార్థినిపై క్యాంపస్‌లోని గార్డు రూంలో అత్యాచారానికి పాల్పడ్డారు.
Kolkata: కోల్‌కతాలో మరో ఆర్జీకర్ లాంటి ఘటన జరిగింది. కస్బా లా కాలేజీలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం క్యాంపస్ లో ఈ ఘటన జరిగింది. గురువారం అరెస్ట్ అయిన ముగ్గురు నిందితుల్లో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు, మరోకరిని కాలేజీలో పనిచేసే వ్యక్తిగా గుర్తించారు. గతేడాది కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన పీజీ వైద్యురాలి హత్యాచార ఘటనను తాజా కేసు గుర్తు చేసింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోల్‌కతా వైద్యురాలి తల్లిదండ్రులు కలిశారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ బాధిత కుటుంబ సభ్యులు లేఖ రాశారు. బుధవారం కలిసేందుకు అనుమతి రావడంతో బాధితురాలి తల్లిదండ్రులు.. అమిత్ షాను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.
Kolkata Rape Murder Case: కోల్‌కతాలోని ఆర్‌జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య తర్వాత సమ్మెలో కూర్చున్న జూనియర్ డాక్టర్లు తమ నిరసనను ఉపసంహరించుకున్నారు. ఆగస్టు 9న కోల్‌కతా ఘటన జరిగినప్పటి నుంచి నిరసనలు తెలుపుతున్న జూనియర్ డాక్టర్లు నెల రోజుల తర్వాత తిరిగి విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నారు. డాక్టర్లంతా శనివారం (సెప్టెంబర్ 21) విధుల్లో చేరనున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇది గొప్ప ఉపశమనం కలిగించే వార్త. ఎందుకంటే., ఆమె…