కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. ఈ కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌పై సీబీఐ మానసిక విశ్లేషణ (Psychoanalysis Test) నిర్వహించగా అందులో సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుడు సంజయ్‌ది లైంగికంగా వికృతమైన మనస్తత్వం, జంతువులను పోలిన ప్రవృత్తిని కలిగి ఉన్నాడని తేలింది.
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ కేసుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వైద్యులను విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేసింది. వైద్యులు తిరిగి విధుల్లో చేరిన తర్వాత వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని సుప్రీం కోర్టు వారికి హామీ ఇచ్చింది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ ట్రాన్స్‌జెండర్స్ కూడా రోడ్డెక్కారు. న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. శనివారం వైద్యులు, నర్సులు 24 గంటల పాటు వైద్య సేవలు బంద్ చేశారు. దేశ వ్యాప్తంగా వైద్య బృందాలతో పాటు ఆయా రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు నిరసన తెలిపారు
కోల్‌కతా హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. వైద్యురాలి హత్యాచారం తర్వాత నెమ్మదిగా ఆందోళనలు సాగుతున్న తరుణంలో ఒక్కసారిగా అల్లరిమూకలు.. ఆస్పత్రిలోకి ప్రవేశించి ఆధారాలు చెరిపేందుకు ప్రయత్నించడంతో తాజాగా ఈ ఆందోళనలు మరింత ఉధృతం అయ్యాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వైద్యులు, నర్సులు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి.
Female Doctor Murder: హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్లు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కోల్‌కతాలోని ఆర్జే మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ దారుణ హత్యకు నిరసనగా..
కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసు వ్యవహారం దేశాన్ని కుదిపిస్తోంది. సభ్య సమాజం తలదించుకునేలా అత్యంత దారుణంగా ఆమె హత్యాచారానికి గురైంది. ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో వెలడైన విషయాలతో గుండెలు తరుక్కుపోతున్నాయి.
పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణం అందరినీ కదిలించింది. లేడీ డాక్టర్‌పై తొలుత అత్యాచారం చేసి, ఆపై దారుణంగా హత్య చేశారు.
పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ శవమై కనిపించింది. సెమినార్ హాల్‌లో నగ్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.