JSW తన వాహనాలను MG మోటార్ ఇండియా సెలెక్ట్ ద్వారా లగ్జరీ విభాగంలోకి తీసుకురాబోతోంది. కంపెనీ MG సైబర్‌స్టర్‌ను త్వరలో ప్రారంభించనుంది. సైబర్‌స్టర్ 2-డోర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు వివరాలు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ముందుకు రానున్నాయి.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా మతిమరుపు. అతను వస్తువులను ఒక దగ్గర పెడుతాడు.. వాటిని మరచిపోతాడు. చాలా సార్లు టాస్ సమయంలో కూడా ముందుగా బౌలింగ్ ఎంచుకోవాలా లేదా బ్యాటింగ్ ఎంచుకోవాలా అని మర్చిపోతాడు. అయితే ‘హిట్ మ్యాన్ ’గా పేరుగాంచిన రోహిత్ గేమ్ ప్లాన్ ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మరిచిపోడు. ఈ రహస్యాన్ని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ బయటపెట్టాడు.
రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా అదరగొట్టింది. బార్బడోస్‌లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని, 17 ఏళ్ల తర్వాత రెండో టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకుంది. కాగా.. ఫైనల్‌కు ముందు భారత ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు కెప్టెన్ రోహిత్ చెప్పిన మాటలను స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు బయటపెట్టాడు.
రిపబ్లిక్ డేను దృష్టిలో ఉంచుకుని.. జనవరి 26న జమ్మూకశ్మీర్‌లో దాడికి ప్లాన్ చేశామని ఉగ్రవాది జావేద్ మట్టూ తెలిపాడు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం విచారణలో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ టెర్రరిస్ట్ హిజ్బుల్ ముజాహిదీన్ సభ్యుడిగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే.. హిజ్బుల్ ముజాహిదీన్ A++ కేటగిరీకి చెందిన ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టూ ఈ నెల జనవరి 4న అరెస్టయ్యాడు. కాగా.. అతన్ని పోలీసులు విచారించగా, ఈ విషయం బయటపడింది.
ఇందూరు సభలో ప్రధాని మోడీ కేసీఆర్ సీక్రెట్స్ అన్ని బయటపెట్టారు. తాను తెలంగాణ పర్యటనకు వస్తున్న సమయంలో తనకు స్వాగతం పలకపోవడంపై కీలక విషయాలు చెప్పారు. GHMC ఎన్నికలకు ముందు కేసీఆర్ తనకు స్వాగతం పలికేవారన్నారు. కానీ GHMC ఎన్నికల తర్వాత సీన్ మారిపోయిందని తెలిపారు. GHMC ఎన్నికల్లో బీర్ఎస్ కు మద్దతు ఇవ్వమని కేసీఆర్ తనను అడిగారని చెప్పారు.