గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు చేస్తోన్న వాగ్దానాలపై పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ఉచితాల నుంచి విముక్తి కల్పించాలని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు.