చూడగానే బాగా పరిచయం ఉన్న అమ్మాయిలా కనిపిస్తుంది. కళ్ళతోనే కోటి భావాలు పలికిస్తుంది. పెదాలు విప్పితే ఆమె ముత్యాల పళ్ళు పలకరిస్తాయి. వెరసి నటి రేవతి నవ్వు ఆకర్షిస్తుంది. అభినయంతో ఆకట్టుకుంటుంది. తెలుగువారిని తనదైన అభినయంతో అలరించిన రేవతి ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలతో పరవశింప చేస్తున్నారు. రేవతి అసలు పేరు ఆశా కేలున్ని. మళయాళ సీమ కొచ్చినలో 1966 జూలై 8న జన్మించారామె. భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన ‘మణ్ వాసనై’ తమిళ చిత్రం ద్వారా…