(జూలై 8న రేవతి పుట్టినరోజు) చూడగానే బాగా పరిచయం ఉన్న అమ్మాయిలా కనిపిస్తుంది. కాసింత పరిచయం కాగానే యెద చుట్టేసుకుంటుంది. కళ్ళతోనే కోటి భావాలు పలికిస్తుంది. పెదాలు విప్పితే ఆమె ముత్యాల పళ్ళు పలకరిస్తాయి. వెరసి నటి రేవతి నవ్వు ఆకర్షిస్తుంది. అభినయం ఆకట్టుకుంటుంది. భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన ‘మణ్ వాసనై’ తమిళ చిత్రం ద్వారా రేవతి తొలిసారి నటిగా గుర్తింపు సంపాదించారు. అనతికాలంలోనే మాతృభాష మళయాళంతో పాటు, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించేసి ప్రేక్షకుల…