KTR: వరదల్లో నిండా మునిగిన రైతాంగాన్నివంచనతో మళ్లీ సర్కారు ముంచిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతులకు ఇచ్చింది పరిహారం కాదు…పరిహాసమన్నారు కేటీఆర్. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే.. వేల ఎకరాలకే అరకొర సాయం చేసి చేతులు దులుపుకోవడం అన్యాయం అని., 4.15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన మాటలు.. వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక వాస్తవం కాదా..? పంట నష్టం అంచనాలను తల్లకిందులుగా ఎందుకు మార్చేసారు..? ఏకంగా…
CM Revanth Reddy: నేడు మరోసారి ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఢిల్లీలో ల్యాండ్ అవగానే హోంశాఖ మంత్రి అమిత్ షాను భేటీ కానున్నారు. అనంతరం వరద నష్టం వివరాలను తెలుపనున్నారు.
BRS Dharna: అర్హులైన రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కందుకూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించనున్నారు.
CM Revanth Reddy: ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీపై ముఖ్యమంత్రి సీరేవంత్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
DK Aruna: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బీజేపీ మహిళ మోర్చ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. కొండా సురేఖతో నాకు మంచి అనుబంధం ఉంది.. గతంలో ఇద్దరం కలిసి మంత్రులుగా పని చేశాం.
KTR: రైతులు పండించిన దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈరోజు జరిగిన సమావేశంలో ప్రభుత్వం కేవలం సన్న వడ్లకే 500 రూపాయలు బోనస్ అని ప్రకటించడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిసెంబర్ 9వ తేదీలోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి, ఆగస్టు 15వ తేదీ వరకు కూడా చేయలేదు.. రేవంత్ రెడ్డి మొగోడు కాదు, మోసగాడు.. కేసీఆర్ ది రైతుల గుండె, సీఎం రేవంత్ రెడ్డి గుండె బండరాయి.. 6 గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన జూట సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కుంటుబడిపోయింది అని హరీష్ రావు పేర్కొన్నారు.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మొత్తం 116.2 కిలోమీటర్ల పొడవునా రెండు దశల్లో మెట్రోను నిర్మించనున్నారు.
CM Revanth Reddy: సీఎం రేవంత్ సర్కార్ తాజాగా కొత్త నిర్ణయం తీసుకుంది. ఈసారి తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం రేవంత్ ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధ్వంసక పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. ఆర్ఆర్ ట్యాక్స్, కూల్చివేతల కారణంగా రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా పడిపోయిందన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపకపోవడంతో.. హైదరాబాద్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఈ మహా నగరం ఇవాళ గందరగోళ పరిస్థితుల్లో కూరుకుపోయిందంటూ కేటీఆర్ మండిపడ్డారు.