CM Revanth Reddy : పటాన్చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం ఉదయం జరిగిన భారీ పేలుడు ఘటన రాష్ట్రాన్ని షాక్కు గురిచేసింది. ఈ ఘోర ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంటల ధాటికి పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం విచారం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. Illegal relationships : దాంపత్య బంధానికి పెనుభూతులవుతున్న వివాహేతర సంబంధాలు..…
కాంగ్రెస్ రాష్ట్రాల్లో కమిషన్ ప్రభుత్వాలు నడుస్తున్నాయని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారిగా కేంద్రమంత్రి నియమింపబడ్డారు.
Harish Rao : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. లక్షలాది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు భవిష్యత్తు నిర్మాణంగా నిలిచిన గురుకులాలు, ప్రస్తుతం నిర్వీర్యం అవుతుండటం దురదృష్టకరమని ఆయన ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. విద్యావ్యవస్థ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న ఉదాసీనత లక్షల మంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల…
Revanth Reddy : టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ ను హైడ్రా అధికారులు కూల్చేశారని.. ఆ తర్వాత నాగ్ రియలైజ్ అయి తమ్మిడికుంట చెరువుకోసం రెండెకరాలు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పీజేఆర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. హైదరాబాద్ ఒకప్పుడు ఎంతో అందంగా ఉండేదన్నారు. ఇష్టారీతిన చెరువులు, నాలాలు కబ్జా చేయడం వల్ల నీటిలో మునిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని క్లియర్…
Jupally Krishan Rao : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన బహిరంగంగా వ్యాఖ్యానిస్తూ, గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ను కూడా ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. తలతిక్క పనులే బీఆర్ఎస్ను తిరస్కరించేలా చేశాయి అని జూపల్లి వ్యాఖ్యానించారు. ఇలాంటివి ఆదర్శ పాలనకు దూరమైన చర్యలు. ప్రజాస్వామ్యంలో నైతిక విలువలకే అవమానం అని…
TG Cabinet : సుపరిపాలన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ సమావేశాల నిర్వహణలో మార్పులు, క్రమబద్ధీకరణకు దారితీసేలా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ భేటీ నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, తదుపరి సమావేశం జులై 10న జరగనున్నది. ఈ సమావేశంపై మంత్రులకు ఇప్పటికే ముందస్తుగా సమాచారం అందించడంతోపాటు, ఇకపై ఈ ప్రక్రియను విధిగా అమలు చేయాలని ప్రభుత్వం…
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని.. బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలకేంద్రంలో ఆయన మాట్లాడారు. ప్రజలు కేసీఆర్ కి ఎదురు తిరగడానికి 9.5 ఏళ్లు పట్టిందని.. కానీ.. రేవంత్ రెడ్డి పాలనకు కేవలం 1.5 ఏళ్లు పట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ 50 సంవత్సరాల కాంగ్రెస్ చీకటి అధ్యాయాన్ని తెలియజేస్తుందన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన మాట్లాడే వారిని చంపివేశారని…
రామ్చరణ్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు నుంచి తెలుసని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఇవాళ హీరో అయ్యాడు. RRR తో దేశానికి గౌరవం తెచ్చి పెట్టాడని కొనియాడారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిందని గుర్తు చేశారు. తాజాగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యాంటీ డ్రగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్, హీరోలు రామ్చరణ్, విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, విజయ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో నేడు ‘అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వినియోగాన్ని కట్టడి చేసేందుకు…
డ్రగ్స్ వల్ల మన దేశానికి.. రాష్ట్రానికి గౌరవం వస్తుందా? అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. మన దేశాన్ని ఎదుర్కోలేం అనుకున్న వాళ్ళు.. కొందరు డ్రగ్స్ ఎంచుకుంటున్నారు. మన దేశస్థులు అలవాటు చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. వాళ్ళ ఉచ్చులో పడదామా? అని అడిగారు.