CM Revanth Reddy : హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట.. గచ్చిబౌలి కేసు కొట్టేసిన న్యాయస్థానం
- గచ్చిబౌలిలో 2016లో నమోదైన కేసులో రేవంత్‌కు ఊరట
- రేవంత్ రెడ్డి పేరిట ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టేసిన హైకోర్టు
- ఘటన సమయంలో రేవంత్ రెడ్డి అక్కడ లేరని స్పష్టత
- సాక్ష్యాధారాలు లేనందున కేసు అసాధ్యమని న్యాయస్థానం అభిప్రాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. గతంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును హైకోర్టు రద్దు చేసింది. 2016లో హౌసింగ్ సొసైటీ స్థలాన్ని అక్రమించేందుకు ప్రయత్నించారని పెద్దిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా, రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, మరో వ్యక్తి లక్ష్మయ్యలపై కేసు నమోదైంది.
Shocking: పనిలో మేనేజర్ టార్చర్.. 15 సార్లు పొడిచి చంపిన మహిళ
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
పెద్దిరాజు ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు ఎస్సీ, ఎస్టీ నిర్బంధ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ 2020లో రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గత నెల 20న ఇరువైపుల వాదనలు పూర్తవగా, న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. ఇవాళ (జూలై 17) న్యాయస్థానం తుది ఉత్తర్వులు వెలువరించింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సంఘటనా సమయంలో రేవంత్ రెడ్డి ఘటనాస్థలిలో లేరని దర్యాప్తులో తేలిందని పేర్కొంది. అలాగే, ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేసును కొట్టేస్తూ తీర్పునిచ్చింది.
RCB: బెంగళూరు తొక్కిసలాట కేసు.. కర్ణాటక ప్రభుత్వ నివేదికలో సంచలన విషయాలు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!