TPCC Mahes Goud : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పరిగి నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ముఖ్య ఉద్దేశం ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కావడం, వారి సమస్యలు తెలుసుకోవడం అని ఆయన స్పష్టంగా తెలిపారు. “మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ పాదయాత్రను ప్రారంభించాం. ఇది కేవలం ఒక రాజకీయ కార్యక్రమం కాదు. ప్రజల జీవితాల్లో ఎదురవుతున్న వాస్తవాలను నేరుగా తెలుసుకోవడానికి,…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు.. ఇవాళ రాత్రి ఢిల్లీకి చేరుకొని, రేపు ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగే జరిగే న్యాయసదస్సు కు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు.. కాంగ్రెస్ న్యాయ విభాగం ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్, సమాచార చట్టానికి స్పందించిన అంశాలపై వార్షిక సదస్సు నిర్వహిస్తున్నారు.. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగే ఈ సదస్సుకు, ఎఐసిసి ముఖ్య నేతలతో పాటూ, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు.. Also Read:Vice…
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీఎం రేవంత్ పై బీజేపీ కాసం వెంకటేశ్వర్లు పెట్టిన కేసును హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లపై సీఎం రేవంత్ చేసిన వాఖ్యల గురించి నాంపల్లి స్పెషల్ కోర్టులో కేస్ వేశాడు కాసం వెంకటేశ్వర్లు. గతేడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన సభలో సీఎం ప్రసంగం వల్ల భాజపా పరువుకు భంగం కలిగిందని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. భాజపా రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అన్నారని ఫిర్యాదులో…
దేశ మంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న పార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పు వెలువడింది. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయస్థానమే వేటు వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్లో ఉంచడం సరికాదు.. మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. Also Read:US:…
దేశ రాజకీయాల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో సుప్రీం కోర్టు గురువారం తుది తీర్పు వెలువరించనుంది. ఈ ఫిరాయింపుల కేసుపై చివరిసారిగా ఏప్రిల్ 3న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టైన్ జార్జి మసీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇప్పుడు జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ కేసుపై సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. Also Read:Extra Marital…
Supreme Court: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించనుంది.. తమ పార్టీలో గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని వాళ్లను అనర్హులుగా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్.. పార్టీ ఫిరాయించిన వారిలో దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీఫామ్ పై సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేశారని కోర్టులో వాదన వినిపించారు బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు.. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పులు రిజర్వ్ చేసింది.. ఫైనల్ గా…
Meenakshi Natarajan Padayatra Schedule: జులై 31 నుంచి ఆగస్టు 6వరకు పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలు ఉంటాయని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పరిగి నియోజకవర్గం నుంచి మొదలై వర్ధన్నపేట వరకు పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు పాల్గొననున్నారు. స్థానిక సంస్థల…
Harish Rao: ఉప్పల్లో జరిగిన BRSV రాష్ట్రస్థాయి విద్యార్థి సదస్సులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పార్టీ నేతలలో ఉత్సాహం నింపేలా మాట్లాడారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన, కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నిద్రలో కూడా కేసీఆర్ కనిపిస్తున్నాడు. ఎప్పుడూ జై మోడీ, జై ఢిల్లీ అంటున్నాడు.. కానీ, ఒక్కసారి కూడా జై తెలంగాణ అనడం లేదని విమర్శించారు. ఇది ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం…
Vivekananda Goud: బీసీ రిజర్వేషన్ల అంశం, సోనియా లేఖపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ (BRS) నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే పట్నం వివేకానంద, బీఆర్ఎస్ నేత క్యామ్ మల్లేశ్ బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో రేవంత్ వ్యాఖ్యలను ఘాటుగా తప్పుబట్టారు. ఈ సమావేశంలో భాగంగా.. ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీ రాసిన లేఖను తనకు ఆస్కార్ లాంటిదని రేవంత్ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారన్నారు.…
Kishan Reddy: బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజుకుంటున్న తరుణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని బీసీలకు అన్యాయం చేస్తున్న పార్టీగా ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సవాల్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో రెండో అత్యధిక కాలం పాటు ప్రధానిగా పనిచేస్తున్న ఘనత సాధించారని పేర్కొంటూ, ఆయనకు తెలంగాణ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపారు. అయితే…