హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలతాల్లో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది.ఆది నుంచి కూడా ఏ రౌండ్లోనూ ఆధిపత్యం సాధించలేకపోయింది. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల ఫలతితాలకు తనదే బాధ్యత అని ఆయన చెప్పారు. ఒక ఉప ఎన్నికతో పార్టీనీ నిర్దేశించలేదన్నారు. ఆలస్యంగా అభ్యర్థిని నిలబెట్టినా… ఊరుఊరు వెంకట్ తిరిగాడన్నారు. భవిష్యత్‌లో పార్టీకి బలమైన నాయకుడు అవుతారన్నారు. రేపటి నుండే నియోజక వర్గంలో ఉంటారు. కష్టపడి పని చేసే ఓపిక.. సహనం నాకు ఉందని…
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిస్థాయిలో వెలువడలేదు.. కానీ, ఈ ఎన్నికల్లో ఊహించిన స్థాయిలో ప్రభావాన్ని చూపించలేకపోయిన కాంగ్రెస్‌లో మాత్రం అప్పుడే రచ్చ మొదలైంది.. అవకాశం దొరికినప్పుడల్లా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేసే ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఈ ఎన్నికల ఫలితాలపై హాట్ కామెంట్లు చేశారు.. ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 5 నెలలు అయినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఆరోపించిన కోమటిరెడ్డి.. ఎన్నికల నోటిఫికేషన్…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై పలు విమర్శనాస్త్రాలు సంధించారు. మంచిర్యాలకు చెందిన మహేశ్ అనే యువకుడు జాబ్ నోటిఫికేషన్లు రావడం లేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్పందించిన రేవంత్ రెడ్డి మరణం.. కాదు రణం చేద్దామంటూ నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఓవైపు ఉద్యోగాలు లేక నిరుద్యోగ యవత ఆత్మహత్యలకు పాల్పడుతుంటే భారీగా పెట్టుబడులు తీసుకువస్తున్నాం.. లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామంటూ కబుర్లు చెప్పుకోవడానికి కేటీఆర్ సిగ్గులేదా అంటూ.. ఆగ్రహం వ్యక్తం…
గాంధీభవన్ లో ప్రారంభమైన టీపీసీసీ ముఖ్య నాయకుల సమావేశం పాల్గొన్న ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్స్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, గీతారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, ప్రచార కమిటీ కన్వీనర్ అజ్మతుల్లా హుసేన్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, రమేష్ ముదిరాజ్, నిరంజన్, వేం నరేందర్ రెడ్డి, కుమార్ రావ్, సురేష్ కుమార్ షెట్కార్, జఫ్ఫార్ జవీద్, కిసాన్ కాంగ్రెస్ నేత కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
కేసీఆర్ అసమర్థతతోనే ప్రాజెక్టులన్ని సమాధి అవుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయనా మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పై NGT స్టే ఇచ్చిందని, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించడానికి చూశారు .. ఇప్పుడు పనులు మధ్యంతరంగా ఆగిపోయాయన్నారు. కేసీఆర్‌కు కొందరు కాంట్రాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు, ప్రాజెక్ట్ రీ డిజైనింగ్ చేశారు. మూడేళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు ఆరేళ్లయినా పూర్తి కాలేదన్నారు. ప్రభుత్వం అసమర్థత…
తెలంగాణ సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఏపీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో సెటైర్లు వేశారు. నదీ జలాల వినియోగం విషయంలో కేసీఆర్ మాట తప్పారని, దిండి, పాలమూరు వంటి ప్రాజెక్టుల్లో తాగునీరు పేరుతో సాగుకు నీళ్లు మళ్ళించారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. తమకు కేటాయించిన నీళ్లకు అదనంగా చెంచాడు నీళ్లు కూడా వాడుకోబోమని ఎప్పుడో చెప్పామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత విషయంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎంత దూరమో…
ఆ రోజు మీటింగ్ లో కేసీఆర్ కు సహాయ సహకారాలు అందించిన ఒక్కరి పేరు కూడా ప్రస్తావించక పోవడం దుర్మార్గం అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈటల రాజేందర్ ను మెడలు పెట్టి బయటకు పంపించాడు…. హరీష్ రావు ను హుజూరాబాద్ లో చెట్టుకు కట్టేసాడు. హరీష్ రావును ఉరి పెడతాడేమోనని భయం భయంగా బ్రతుకుతున్నాడు.. కేజీ టు పిజి ఉచిత విద్య పై , ఉన్నత విద్యకు నిధుల కేటాయింపు పై చర్చకు సిద్ధమా, ఫీజు…
ఈ నెల 30న హుజురాబాద్ ఉప ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనుండగా, నవంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు వాటి ప్రచారాల్లో దూకుడు పెంచాయి. ఉప ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త వ్యూహ్యాలను ఎంచుకుంటున్నారు. ప్రచారంలో తమ దైన శైలితో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే ప్రైవేటు, ప్రభుత్వ సర్వే సంస్థలు…
హుజురాబాద్ బై పోల్‌కు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలు ప్రచారం జోరును పెంచాయి. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ తెలుగు తల్లి ముందు మోకరిల్లిండన్నారు. తెలుగు తల్లిని బరితెగించి తిట్టిన కేసీఆర్ ప్లీనరీలో పెట్టిన స్వాగత తోరణంలో పెట్టింది తెలుగు తల్లినే అని అన్నారు. గులాబీ చీడకు పెట్టుబడి పెట్టింది ఆంధ్ర కాంట్రాక్టర్లు అందుకే తెలుగుతల్లి తోరణం పెట్టారన్నారు. టీఆర్ఎస్ ఉద్యమం ముసుగులో రాజకీయ పార్టీగా ఎదగడానికి ఎందరినో…
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి షాక్ తగిలినట్టు అయ్యింది.. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీలో కొత్త జోష్ వచ్చిందని కొందరు నేతలు చెబుతున్నమాట.. ఇక, భారీ ఎత్తున పార్టీలోకి వలసలు ఉంటాయని కూడా ప్రచారం జరిగింది. కానీ, రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తోన్న మల్కాజ్గిరి పార్టీమెంట్ స్థానం పరిధిలోనే పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్.. పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను…