అత్తా కోడళ్ళ పంచాయతీ లెక్క బీజేపీ, టీఆర్ఎస్ పంచాయతీ అని టీపీసీసీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గురువారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో రేవంత్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీ ఇద్దరూ కలిసే ఉన్నారని విమర్శించారు. వాళ్ళు వేరు వేరు అని ఎప్పుడూ అనుకోవద్దని, ఏ విషయంలో సరే వాళ్ళు విడిపోయారు చెప్పండని ప్రశ్నించారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచుతున్నాడు కెసిఆర్ అని చెప్పింది బీజేపీ నే అని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. అప్పులు తెచ్చుకో అని 4…
AICC ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన జాతీయస్థాయి చింతన్ శిబిర్ తర్వాత.. తెలంగాణలోనూ కాంగ్రెస్ చింతన్ శిబిర్ సమావేశాలను ఘనంగా ముగించారు రాష్ట్ర పార్టీ నాయకులు. కాకపోతే ఈ చింతన్ శిబిర్తో పార్టీ ఏం చెప్పాలని అనుకుంది? ఏం చెప్పింది అనేది పార్టీ కేడర్‌కు కూడా అంతుచిక్కడం లేదట. ఆ సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులంతా ఓపెన్ అయ్యారు. వాటిలో పార్టీ తీసుకున్న నిర్ణయాలేంటన్నదే స్పష్టత కరువైనట్టు కేడర్ చెవులు కొరుక్కుంటోంది. అమలు చేయాల్సిన నిర్ణయాలేంటో కూడా శ్రేణులకు అర్ధం కాలేదని…
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై టీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీ సీవీ ఆనంద్ చెప్పిన విధానం చూస్తుంటే.. అవసరమైన వాళ్లను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో నిందితులు, బాధితురాలు ప్రయాణించిన బెంజ్ కారు, ఇన్నోవా ముఖ్యమైన ఆధారాలని ఆయన అన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే, యజమానులకు సమాచారం అందించాలని..ఎంపీ యాక్ట్ ప్రకారం యజమానులను పోలీస్ స్టేషన్ కు పిలవాలని.. లేదంటే వాళ్లపై కేసులు పెట్టాలని…
టీ-కాంగ్రెస్ మినీ చింతన్ శిబర్ కు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గైర్హాజరు కావడం అందరినీ కలచివేసింది. అయితే రేవంత్ ఎక్కడ? అని అందరూ ఆరాతీస్తుంటే రేవంత్ మాత్రం అమెరికాలో వాలిపోయాడు. రేవంత్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ పరిశీలిస్తే రేవంత్ రెడ్డి ప్రస్తుతం యునైటెడ్ స్టేట్ లోని డల్లాస్ లో ఉన్నారు. అక్కడ తన యుఎస్ టూర్లో రేవంత్ ఎన్నారై కమ్యూనిటీ నుండి మద్దతు కోసం పర్యటిస్తున్నారు. . తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా…
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈ రోజు ఈడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 8న సోనియా గాంధీని, 5న రాహుల్ గాంధీని హాజరుకావాల్సిందిగా కోరింది. ఈ కేసులో వీరిద్దరి స్టేట్మెంట్లను రికార్డ్ చేయనుంది ఈడీ. అయితే ఈడీ సమన్లపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేకే బీజేపీ ప్రభుత్వం ఈడీ, ఐటీల వంటి కేంద్ర సంస్థలను ఉపయోగిస్తోందని విమర్శిస్తున్నారు. బ్రిటిష్…
కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తే తెలంగాణ లేకుండా అసలు అవార్డులే లేవని. కేంద్రం సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద దేశంలో 20 గ్రామాలు ప్రకటిస్తే తెలంగాణలోని 19 గ్రామాలకు అవార్డులు వచ్చాయని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ బండి సంజయ్ తొండి సంజయ్ అని.. రేవంత్ రెడ్డిది గోబెల్స్ ప్రచారం అని విమర్శించారు. బీజేపీ పాలిత 19 రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిత చత్తీస్ గఢ్ లో అవార్డులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బిల్లులు ఇవ్వలేదని…
రేపటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ మేథోమధన సదస్సు, శింతన్ శిబిర్ పేరిట కీసరలో సమావేశాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతో పాటు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి జరగబోతున్న కాంగ్రెస్ సమావేశాలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంపై సీఎల్పీ నేత బట్టి విక్రమార్క స్పందించారు. వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా కొందరు అందుబాటులో ఉంటారు.. కొందరు ఉండరని ఆయన అన్నారు. వ్యక్తుల…
ఘట్కేసర్లో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెడ్డి సింహగర్జన సభకు హాజరయ్యారు మంత్రి మల్లారెడ్డి. అప్పటి వరకు బాగానే సాగిన మంత్రి మల్లారెడ్డి స్పీచ్ పై అక్కడ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కార్ పథకాలను ఆయన వివరించడంతో పరిస్థితి మారిపోయింది. ప్రసంగం తర్వాత సభ నుంచి తిరిగి వెళ్లిపోతున్న మల్లారెడ్డి కాన్వాయ్‌పై కొందరు దాడి చేయడం రాజకీయ వేడి రగిలించింది. ఈ దాడి వెనక పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మనుషులు ఉన్నారని ఆరోపించారు…
రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. ఇప్పుడు ఆయన మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నేతలు డప్పు కొడుతున్నట్టు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ తల్లి కాదని, దేశ ద్రోహి అని విమర్శించారు. అసలు కాంగ్రెస్ పార్టీనే దేశద్రోహి పార్టీ అంటూ బాంబ్ పేల్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి…
మంత్రి మల్లారెడ్డిపై దాడి, వ్యక్తిగత దాడి కాదని.. ప్రభుత్వంపై రైతులకు ఉన్న వ్యతిరేఖత అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ నేతలు సెటిలర్ల ఓట్ల కోసం ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ను పిలవకున్నా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని విమర్శించారు. ప్రధానికి కనీస గౌరవం ఇవ్వడం లేదని అన్నారు. కేసీఆర్ గెలవలేకనే పీకేను అరువు తెచ్చుకున్నాడని అన్నారు. సీఎం కేసీఆర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ…