తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 16 అభ్యర్థులతో మూడో జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసింది. నామినేషన్లు మరో ఐదు రోజుల్లో ముగియనున్నాయి. టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొన్న స్థానాలను ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రకటించింది.
సీపీఐ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదిరింది. కొత్తగూడెం సీటు, ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. మునుగోడులో స్నేహపూర్వక పోటీ కూడా ఉండొద్దని తేల్చి చెప్పింది.
TS Nominations: కొడంగల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా రేవంత్ రెడ్డి కొడంగల్ చేరుకోనున్నారు. ఉదయం 10 గంటలకు రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Dharmapuri Arvind: ఇవాళ మెట్పట్టి పట్టణంలో కోరుట్ల బీజేపీ అభ్యర్థి అర్వింద్ ధర్మపురి ఆధ్వరంలో బీజేపీ భారీ ర్యాలీ సభ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు అయ్యప్ప ఆలయం నుండి ప్రారంభకానుంది.
Bhatti vikramarka: కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ముదిగొండ మండలం, మధిర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ..
గొర్లను మింగేటోడు కేసీఆర్ అయితే, బర్లను మింగేటోడు రేవంత్ రెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు ఎంపీ అరవింద్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ నేనే కట్టిన అనే చంద్రబాబు ఇక్కడ అభ్యర్థులను ఎందుకు పెట్టడం లేదన్నారు breaking news, latest news, telugu news, minister ktr, revanth reddy, mp arvind
Revanth Reddy: బండి సంజయ్ ని పదవి నుండి తప్పించిన తర్వాత బుర్ర పని చేస్తున్నట్టు లేదని టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి పరిధిలో ఉండే కమిటీనే.. తప్పు జరిగింది అని చెప్పిందన్నారు.
స్ట్రాంగ్ లీడర్ కేసీఆర్ ఉండగా.. రాంగ్ లీడర్లు మనకెందుకు అని మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కర్ణాటక పరిస్థితి తెలంగాణలో వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రోగ్రాం సంగారెడ్డిలో ఫెయిల్ అయ్యిందన్నారు. సంగారెడ్డి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిన మన మీటింగ్ కి వచ్చినంత మంది రాలేదని వ్యంగాస్త్రాలు సంధించారు.
తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఎన్నికల బరిలో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన ఆమె ఇప్పుడు పోటీకి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వాలని వైఎస్ ఆర్ టీపీ నిర్ణయించిందన్నారు.