Harish Rao: రేవంత్ ది వ్యవసాయం చేసిన ముఖమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. రేవంత్ ది వ్యవసాయం చేసిన మొఖమేనా? అని ప్రశ్నించారు. గజ్వేల్ లో కాంగ్రెస్ అభ్యర్థి పత్తా లేడని వ్యంగాస్త్రం వేశారు. సిద్దిపేటలో నాకు లక్ష మెజారిటీ ఇచ్చారని అన్నారు. గజ్వేల్ లో పెద్ద సారు కేసీఆర్ కి నాకంటే ఎక్కువ మెజారిటీ ఇవ్వాలన్నారు. బూతులు మాట్లాడే నాయకులకు పోలింగ్ బూత్ లో మీ ఓట్లతో సమాధానాలు ఇవ్వండి అని మంత్రి అన్నారు. పెద్ద మనిషిని పట్టుకుని ఒకటే బూతులు తిడుతున్నారని అన్నారు. కటిక వేస్తే వచ్చే కరెంట్ కావాలా..? కటిక చీకట్ల కాంగ్రెస్ కరెంట్ కావాలా..?అని ప్రశ్నించారు. కర్ణాటక లో కాంగ్రెస్ వచ్చాక మూడు గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. రేవంత్ రెడ్డి 10HP మోటర్ కొనాలి అంటున్నారని తెలిపారు. రేవంత్ ది వ్యవసాయం చేసిన మొఖమేనా? అని ప్రశ్నించారు. పొరపాటున కాంగ్రెస్ కి ఓటేస్తే మూడు గంటల కరెంట్ వస్తుందని అన్నారు.
గజ్వేల్ లో తిరిగే బీజేపీ అభ్యర్థిని గ్యాస్ సిలిండర్ 1200 రూపాయలు ఎందుకు అయ్యిందని నిలదీయండి అన్నారు. ఈ రాష్ట్రంలో బిజెపి వస్తుందా..? అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు వచ్చింది.. ఈ సారి డక్ ఔట్ అవుతుందని తెలిపారు. బీజేపీకి ఓటేస్తే మీ బావి కాడ మీటర్ వస్తుందన్నారు. కేసీఆర్ కి ఓటేస్తే 24 గంటల కరెంట్ వస్తుందని తెలిపారు. బీజేపీ పార్టీకి గజ్వేల్ లో ఓటు అడిగే హక్కు లేదని మండిపడ్డారు. నిన్న మొన్నటి వరకు గజ్వేల్ అభివృద్ధి చెందిందని లొల్లి పెట్టారని గుర్తుచేశారు. గజ్వేల్ అభివృద్ధికి కాళ్ళలోకి కట్టెలు పెడుతున్నారు ఇతర పార్టీల నాయకులు అంటూ మండిపడ్డారు. కులం పేరుతో, బంధువుల పేరుతో గజ్వేల్ వస్తున్నారని తెలిపారు. నవంబర్ 30 తర్వాత గజ్వేల్ లో కేసీఆర్ తప్ప ఎవ్వరు ఉండరని అన్నారు. కంటికి రెప్పలా కార్యకర్తలును కాపాడుకుంటామని మంత్రి అన్నారు.
Aishwarya Rai: నీ కోసమే ఊపిరి తీసుకుంటున్నా.. ఐశ్వర్య రాయ్ ఎమోషనల్ పోస్ట్
Also Read
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!