ఈ ప్రభుత్వ హయాంలో రైతు బంధు, రైతు బీమా ఉంటుందో.. ఉండదో తెలియని పరిస్థితి ఏర్పడిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. బస్సు యాత్రలో భాగంగా సూర్యాపేటకు చేరుకున్న ఆయన అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
రాష్ట్రంలో నీళ్ల పంచాయితీ మళ్లీ మొదలైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత మొదటి అసెంబ్లీ సమావేశంలో ప్రాజెక్టుల విషయంపై అధికార పార్టీ, బీఆర్ఎస్ నాయకులు రాళ్లు రువ్వుకున్నారు. తప్పు మీదంటే.. మీదంటూ ఒకరినోకరు విమర్శించుకున్నారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. ఇప్పటికే దాదాపు అన్ని స్థానాకలకు అభ్యర్థులను ముందుగానే ప్రకటించిన హస్తం పార్టీ మూడు స్థానాలపై చాలా రోజులు కసరత్తు జరిగింది. అందులో కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ ఉన్నాయి. రేపు నామినేషన్ ప్రక్రియ ముగుస్తుండటంతో అభ్యర్థులను ఖరారు చేసింది
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. కొంతకాలం క్రితం వరకు ధీమాగా ఉన్న రైతాంగం ప్రస్తుతం దిగాలు పడుతోందని కేసీఆర్ అన్నారు.
మామా అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగిరిపడుతున్నారని..అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నిన్న నాలుగు గంటలు టీవీ స్టుడియోలో ఎలా కూర్చున్నాడని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మందేసి గీశాడో.. దిగాక గేసాడోగానీ కూలిపోయిందని విమర్శించారు.
అసెంబ్లీ చర్చలకి రాని దద్దమ్మలు 4గంటలు మీడియాలో కూర్చున్నారని కేసీఆర్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన చర్చకు సిద్ధమా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ అద్భుతం అంటున్నాడని.. కాళేశ్వరం దగ్గరనే చర్చ పెడుదం రా.. అని సవాల్ విసిరారు.
సార్వత్రిక ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించుకుంటున్నాయి. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ అహంకారన్ని దించాలంటే చురుక్కు పెట్టాల్సిందే అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల మేడలు వంచుతామన్నారు.
వాలంటీర్ల రాజీనామాలపై హైకోర్టులో పిటిషన్ ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో విలేజ్/వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవహారం కాకరేపుతోంది.. అయితే, మూకుమ్మడిగా వాలంటీర్లు రాజీనామా చేయడం చర్చగా మారింది.. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఏపీలో వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టులో బోడే రామచంద్ర యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు.. బీసీవై పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బోడే రామచంద్ర యాదవ్.. వాలంటీర్ల రాజీనామాలు ఆమోదిస్తే వీరంతా ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తారని, ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు పక్కదారి…
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే.. రాత్రికి రాత్రే బీఆర్ఎస్ ను నామరూపాలు లేకుండా చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.