హేటిరో సంస్థకు ఇచ్చిన భూమి పై ఇప్పటి వరకు ప్రభుత్వం చర్యలు లేవు అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని ఆమోదిస్తున్నట్లు అర్థమవుతుంది.. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టడం బాధాకరమన్నారు.
Arvind Dharmapuri: వడ్లకు బోనస్ ఇస్తామన్న సీఎం.. ఇప్పుడు ఆగస్టు అంటున్నాడని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలం అయ్యిందన్నారు.
ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి రైతు రుణమాఫీ చేయలేదు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆగస్ట్ 15వ తేదీ లోపు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతాం అన్నారు. వచ్చే సారి పండించే వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రతి గింజ కొనుగోలు చేసే బాధ్యత నాదన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ వ్యవహార శైలిపై బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం టీవీ సీరియల్ లా సాగుతుందని, అసలైన నేరస్థులను అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూనే.. ఇప్పుడు కాంగ్రెస్ లో బట్టి, ఉత్తం ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని కేటీఆర్ మాట్లాడుతున్నాడని, లై…
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నా సందర్భంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభద్రతా భావం కలుగుతుందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. గ్రామాల్లో ఉన్న ముసలి వారు కూడా మోడీకే ఓటు వేస్తాం అంటుంటే కాంగ్రెస్ భయపడుతోందన్నారు.
గుండెపోటుతో హఠాన్మరణం పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు హాజరై నివాళులు అర్పించారు.
కేసీఆర్ సిరిసిల్లలో వడ్ల బోనస్ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి డ్రాయర్ ఊడదీస్తా అంటున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు సీఎంవా చెడ్డి గ్యాంగ్ లీడర్‌వా రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు.
Jagadish Reddy: కేసీఆర్ రాకతో లాగులు తడిసి బాహుబలి మోటర్లు అన్ చేశారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి అన్నారు. తుక్కుగుడా సభ పెట్టి మరొక సారి ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందని తెలిపారు.
Etela Rajender : దానం నాగేందర్ కు ఎట్లా ఎంపీ సీట్ ఇస్తారు..? అని బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రశ్నించారు. తాత్కాలిక పేరు కోసం, చప్పట్ల కోసం నా ప్రసంగం ఉండదు అది నా విధానం కూడా కాదన్నారు. ఒకరిని కించ పరిచే విధంగా రాజకీయ వ్యవస్థ ఉండకూడదనే కోరుకునే మొదటి వ్యక్తిని అన్నారు. చరిత్ర నిర్మాతలు ప్రజలే కాబట్టి ఆ ప్రజలనే నేను నమ్ముకున్నారని తెలిపారు. ఆరు దశాబ్దాలు దేశాన్ని, నాలుగు దశాబ్దాలు…
వ్యవసాయం సంక్షోభంలో ఉందని, మన ప్రభుత్వం పోయి నాలుగు నెలల్లో ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది అనుకోలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం తెలంగాణ భవన్లో రైతు దీక్షలో ఆయన పాల్గొన్నారు.