ఈ నెల 18వ తేదీన శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర పునర్విభజన జరిగి పదేండ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలతో తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ అంటూ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యిందన్నారు. కేసీఆర్పై ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్కు ఓటేశారన్నారు.
CM Revanth Reddy Cast his Vote: ఓటు వేసేందుకు కుటుంబసభ్యులతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్కు వెళ్లారు. జిల్లా పరిషత్ స్కూలులోని పోలింగ్ కేంద్రంలో రేవంత్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం సతీమణి, ఆయన కూతురు కూడా కొడంగల్లో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం రేవంత్ రెడ్డి తన వేలిని మీడియాకి చూపించారు. ఆపై అక్కడి స్థానికులతో సీఎం మాట్లాడారు. తాను ఓటు వేశానని, అందరూ తమ ఓటు హక్కును…
పదేళ్ల నిజం కేసీఆర్ పాలన, పదేళ్ల విషం బీజెపీ పాలన.. 150 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం వీటి మధ్యనే పోటీ జరుగుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ మాట్లాడుతూ.."నరేంద్రమోడీ వస్తె కాలేజులు కట్టిన, రోడ్లు వేసిన అని చెప్పాలే.
రోజు రోజుకు బీజేపీ పట్ల సానుకూలత పెరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. సికింద్రాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. కంటోన్మెంట్ లో ఓటుకు రూ. 2000 పంచుతూ ప్రజలను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు.
Revanth Reddy: సీఎం కార్యాలయంలో పెత్తనం మొత్తం జగ్గారెడ్డిది అని.. రబ్బర్ స్టాంపు లా నేను పని చేస్తున్ననని, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్న అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేటితో రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం గడువు ముగియనుంది. దీంతో రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
Priyanka Gandhi: ఎన్నికల ప్రచారానికి చివరి రోజున ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నారు. తాండూరు, కామారెడ్డిలలో ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు.
కుమారి ఆంటీ అందరికీ సుపరిచితమే. హైదరాబాద్లో ఫుడ్ వ్యాపారం చేసి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆమె ఫేమస్ అవ్వడంతో భారీగా జనాలు ఫుడ్ సెంటర్ కి వచ్చే వాళ్లు. రోడ్పై ఫుడ్ అమ్మడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతున్నందున.. పోలీసులు అక్కడ వ్యాపారం చేసుకోకూడదని హెచ్చరించారు.